షూటింగ్ కంప్లీట్ చేసుకున్న క్రిష్ ‘మణికర్ణిక’

Friday,March 30,2018 - 07:03 by Z_CLU

కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీబాయ్ గా కనిపించనున్న హిస్టారికల్ ఎంటర్ టైనర్ ‘మణికర్ణిక’. మే 4 న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా, సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వీరనారి లక్ష్మీ బాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సోను సూద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

బాలయ్య తో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ ఎంటర్ టైనర్ తరవాత క్రిష్, మళ్ళీ అలాంటి హిస్టారికల్ కథాంశాన్నే ఎంచుకున్నాడు. విజయేంద్ర వర్మ కథనందించిన ఈ సినిమాలో రాణి లక్ష్మీ బాయ్ లైఫ్ లోని, మరెన్నో కోణాలను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించనున్నాడు క్రిష్.

ఆగష్టు 15, 2018 ని రిలీజ్ డేట్ గా లాక్ చేసుకున్న ‘మణికర్ణిక’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. కమాల్ జైన్, నిశాంత్ పిట్టి తో పాటు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి  శంకర్-ఎహసాన్ -లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.