టాలెంటెడ్ డైరెక్టర్ కెరీర్ గ్రాఫ్

Thursday,September 26,2019 - 02:24 by Z_CLU

చేసింది నాలుగంటే నాలుగే సినిమాలు. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ తో దర్శకుడిగా పరిచయమై ఇప్పుడు సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేసే స్థాయికొచ్చేసాడు. అతనే అనిల్ రావిపూడి. నిజానికి అనీల్ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే అతని స్టామినా ఏంటో ఎంత ప్రతిభల దర్శకుడో యిట్టె అర్థమైపోతుంది. మొదటి సినిమాకే తన సత్తా ఏంటో చూపించి ఆ తర్వాత ‘సుప్రీం’,’రాజా ది గ్రేట్’ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘F2’తో ఏకంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేసాడు.

‘F2’ సక్సెస్ అయిన వెంటనే మహేష్ బాబు కి ఓ కథ రెడీ చేసేసి సూపర్ స్టార్ ను ఇంప్రెస్ చేసి డేట్స్ పట్టేసాడు. నిజానికి ఇది మాములు విషయం కాదు. ఒక సినిమా చేసే ముందు ఎంతో ఆలోచించే మహేష్ బాబు ని లైన్ లో పెట్టాలంటే ఎక్సలెంట్ టాలెంట్ కావాలి. అది అనీల్ లో ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకరకంగా చూసుకుంటే ఈ దర్సకుడిలో ఎవరికీ లేని ఓ స్పెషల్ టాలెంట్ ఉంది. సినిమా గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తన రైటింగ్ తో ఏదో మేజిక్ చేసి ఎంటర్టైన్ చేస్తాడు. పైగా అనీల్ రావిపూడి సినిమా అంటే ఓ సెపరేట్ మేనరిజం కూడా ఉంటుంది. వాటితోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు కూడా. ఇక కామెడీ క్యారెక్టర్స్ ని సరిగ్గా వాడుకోవడంలోనూ అనీల్ దిట్టే.

నిజానికి అనీల్ కెరీర్ ఇప్పటి వరకూ ఒకెత్తు ఇకపై ఒకెత్తుగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం సూపర్ స్టార్ తో చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ తనకి అతిపెద్ద టాస్క్. ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ప్రేక్షకులు అనీల్ ను స్టార్ డైరెక్టర్స్ కేటగిరిలోకి వేసేస్తారు. ఇప్పటికే ‘F2’ తో ఆ మార్క్ వరకూ రీచ్ అయిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆల్మోస్ట్ స్టార్ డైరెక్టర్ లిస్టు వరకూ వచ్చేసినట్టే. ‘సరిలేరు నీకెవ్వరు’ రిజల్ట్ ను బట్టి జస్ట్ లోపలి వెళ్తాడంతే. మరి అనీల్ వచ్చే సంక్రాంతికి మరోసారి సరిలేరు తనకెవ్వరు అనిపించుకుంటాడా చూడాలి.