Anil Ravipudi - నెక్స్ట్ ఏంటి?

Thursday,April 29,2021 - 04:32 by Z_CLU

ఒక సూపర్ హిట్ కొడితేనే ఆ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా ఏంటనేది  హాట్ టాాపిక్ అవుతుంది. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ లేటెస్ట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై క్యురియాసిటీ ఉండదా? ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏమిటా ? అని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం F2 సినిమాకు సీక్వెల్ గా F3 చేస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి.

బాలకృష్ణ తో అనిల్ నెక్స్ట్ సినిమా ఉంటుందని కొందరు… లేదు లేదు రామ్ తోనే నెక్స్ట్ సినిమా చేస్తాడని మరికొందరు… రాజా ది గ్రేట్ సీక్వెల్ చేసే ప్లానింగ్ లో అనిల్ ఉన్నాడని ఇంకొందరు చెప్తున్నారు. వీటితో పాటు అనిల్ రావిపూడి ఎప్పటి నుండో ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది.

ఇక వీటికంటే ముందు మహేష్ బాబుతో అనిల్ మరో సినిమా అంటూ కూడా గట్టిగా టాక్ వినబడుతుంది. అనిల్ కూడా మహేష్ తో మరో సినిమా ఉంటుందని చెప్పుకున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ లో అనిల్ ముందుగా ఏది సెట్స్ పై పెడతాడా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

ఇక బాలయ్య -అనిల్ రావిపూడి కాంబో సినిమా ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. అలాగే రామ్ తో కూడా అనిల్ సినిమా చేయాల్సి ఉంది. అసలు రాజా ది గ్రేట్ స్క్రిప్ట్ ని ముందుగా రామ్ కే వినిపించాడు అనిల్. ఆల్మోస్ట్ అంతా ఓకె అనుకున్నాక ప్రాజెక్ట్ లో నుండి రామ్ తప్పుకోవడం, వెంటనే రవితేజ లైన్లోకి రావడం జరిగింది. ఇటివలే రామ్ ని కలిసి మరో సబ్జెక్ట్ చెప్పాడట అనిల్. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ డెలివరీ చేస్తున్న అనిల్ తో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్న రామ్ తాజాగా ఈ డైరెక్టర్ ని తన నెక్స్ట్ సినిమాకు లాక్ చేసుకున్నాడని అంటున్నారు. మరి బాలయ్య, మహేష్, రామ్, రవితేజ వీళ్ళల్లో అనిల్ రావిపూడి ఎవరితో నెక్స్ట్ సినిమా చేస్తాడో చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics