అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ

Wednesday,January 08,2020 - 05:32 by Z_CLU

గతేడాది సంక్రాంతికి ‘F2’ తో కడుపునిండా నవ్వించేశాడు. ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో ‘సరిలేరు..’ తెరకెక్కించాడు. సినిమా సినిమాకి ఎదుగుతూ.. తన ప్రతి సినిమాలో ఓ పర్టికులర్ మేనరిజమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న అనిల్ రావిపూడి… ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం… 

 

ఈసారి కమ్మటి సంక్రాంతి… 

లాస్ట్ ఇయర్ సంక్రాంతి కన్నా ఈ ఇయర్ సంక్రాంతి మరింత బావుంటుంది. పండక్కి అన్ని రకాల వంటలతో తింటే ఎంత బావుంటుందో.. అలాంటి అన్ని విషయాలతో దేశభక్తి, కామెడీ, వ్యాల్యూస్, సెంటిమెంట్… అన్నీ ఉన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు…’.

ఇది మహేష్ బాబుకు నేనిచ్చే గిఫ్ట్… 

‘F2’ చేసేటప్పుడే నేను మహేష్ బాబుగారికి ఈ కథ చెప్పాను. ఆయన నన్ను నమ్మినట్టుగానే కేవలం 5 నెలల్లో సినిమా కంప్లీట్ చేశాను. ఆయన నన్ను నమ్మినందుకు ఈ సినిమా నేను ఆయనకి ఇచ్చే గిఫ్ట్.

ప్లానింగ్ ఉండాలి దేనికైనా… 

సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే స్క్రిప్ట్ రెడీగా ఉంది. దానికి తోడు ఏ సెట్ అడిగినా టైమ్ కి ఇచ్చిన ప్రకాష్ గారు, నిర్మాత అనిల్ సుంకర గారు, ప్రొడక్షన్ టీమ్ తో పాటు డైరెక్షన్ టీమ్… అందరూ పక్కా ప్లానింగ్ ప్రకారం చేశాం కాబట్టే ఇంత తొందరగా సినిమా కంప్లీట్ అయింది… 

మహేష్ బాబు గారికి నచ్చిందదే…

F2 చేస్తున్నప్పుడే నా దగ్గర 35 నిమిషాలకు సరిపడా పాయింట్ ఉంది. మహేష్ బాబు గారు ఒకసారి కథ విన్నాక అందులో ఉన్న మ్యాజిక్ ఆయనకీ నచ్చింది. నమ్మేశారు కథని…  క్యారెక్టర్స్ నచ్చాయి. ఫిబ్రవరి లో మనం సినిమా చేస్తున్నాం అని ఆయన కన్ఫమ్ చేశాక మార్చి, ఏప్రిల్, మే.. 3 నెలల్లో మిగతా కథ రెడీ చేసుకున్నా… ఆ తర్వాత మళ్ళీ ఆయన కథ వినలేదు. షూటింగ్ కి మరో 20 రోజులో వెళ్తున్నామనగా అప్పుడు మొత్తం నేరేషన్ విన్నారు.

మహేష్ బాబుకి నచ్చిందదే…

కథ కన్నా సినిమాలో మహేష్ బాబుగారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. అప్పటివరకు ఆర్మీలో తన దేశ ప్రజలను కాపాడుకోవడానికి ఫైట్ చేసే సోల్జర్, సడెన్ గా జనాల్లోకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు చేసే తప్పులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. రౌడీలను కూడా తనవాళ్ళలాగే ట్రీట్ చేస్తుంటాడు. ఈ పాయింట్ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది. మహేష్ బాబుగారికి నచ్చింది కూడా అదే…

సుప్రీమ్ సమయంలో…

నేనొకసారి సుప్రీమ్ సినిమా చేసేటప్పుడు ఆర్మీ ఆఫీసర్ ని కలుసుకున్నాను. ఆర్మీ వాళ్ళు అనగానే ఏదో టఫ్ గా ఉంటారు అనుకునేవాణ్ణి. కానీ చాలా సరదాగా ఉన్నాడు… అప్పుడనిపించింది.. వీళ్ళు సందర్భాన్ని బట్టి బిహేవ్ చేస్తారని.. అక్కణ్ణించే ఈ ఆలోచన పుట్టింది.

3 క్యారెక్టర్స్… నో ఫ్యాక్షనిజం…

కర్నూలు బ్యాక్ డ్రాపే కానీ సినిమాలో ఫ్యాక్షనిజం ఉండదు. ఓ 3 క్యారెక్టర్స్… స్టేట్ మినిస్టర్ గా ప్రకాష్ రాజ్ గారు, విజయశాంతి గారు… హీరో.. ఓ సిచ్యువేషన్… దానికి ఈ ముగ్గురూ ఎలా రియాక్ట్ అవుతారన్నదే సినిమా… 

అంత ఈజీ కాదు…

ఈ సినిమాకి లక్కీగా అన్నీ కలిసొచ్చాయి కాబట్టే టైమ్ కి ఫినిష్ చేయగలిగాం. ఓ సినిమా తొందరగా కంప్లీట్ అవ్వాలంటే డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటేనే సరిపోదు.. ఒక్కోసారి ఆర్టిస్టులు సమయానికి అందుబాటులో ఉండరు. దాని వల్ల మినిమం ఓ వారం ఆగాల్సి వస్తుంది… అలా ఒక్కోటి సినిమా మేకింగ్ డేస్ ని పెంచుకుంటూ పోతుంది. సినిమా తొందరగా కంప్లీట్ చేయడమన్నది అంత ఈజీ కాదు.

అది మహేష్ బాబు గొప్పతనం…

సూపర్ స్టార్ సినిమా అనగానే మనలో కొంచెం నర్వస్ నెస్ ఉంటుంది. అలాంటిది ఆయన మాత్రం మొదటి రోజు  నుండే కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. ఫ్రెండ్లీగా ఉంటారు.. సరదాగా ఉంటారు.. కొంచెం టైమ్ దొరికినా అందరినీ నవ్వించేస్తుంటారు…అదే ఆయన గొప్పతనం.

ఓ కారణం ఉందనిపిస్తుంది…

13 ఏళ్ల తరవాత విజయశాంతి గారు ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ చూస్తే ‘ఇందుకేనా ఆవిడ ఈ సినిమా చేశారు…’ అనిపిస్తుంది. అంత పవర్ ఫుల్ గా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్.

స్పెషల్ మేనరిజం…

నా సినిమా అనగానే ఈసారి ఎలాంటి మేనరిజం ఉంటుంది సినిమాలో అనే క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది ఆడియెన్స్ లో. లక్కీగా ఈ సినిమాకి కూడా ఏదో పెట్టాలని పెట్టినట్టు కాకుండా న్యాచురల్ గా కొన్ని మేనరిజమ్స్ కుదిరాయి.

నన్ను మోసిన ప్రతి మెట్టు గొప్పదే…

నాకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారు లేకపోతే నేను లేనట్టే. ఆ తరవాత ‘సుప్రీమ్’ తో సాయి ధరమ్ తేజ్, మాస్ మహారాజ్ రవితేజ… వెంకటేష్ గారు.. వరుణ్ తేజ్.. అందరూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. 

ప్రస్తుతానికి నో బాలీవుడ్… 

టాలీవుడ్ చాలా బావుంది. వరసగా సినిమాలు చేస్తున్నా… టైమ్ కి డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ ఇంత బావుంటే ఇంకా కోలీవుడ్.. బాలీవుడ్ ఎందుకు..? ప్రస్తుతానికి నాకు ఆ ఆలోచన లేదు. 

ఫ్యాన్స్ కోసం ఎలిమెంట్స్ మాత్రమే… 

సరిలేరు..’ కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే చేసిన సినిమా కాదు. ఒక సోల్జర్ జనాల్లోకి వస్తే ఒక సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అయ్యాడు. ఎలా సొల్యూషన్ ఇచ్చాడు అనేదే సినిమా. ఫ్యాన్స్ కోసం పర్టికులర్ గా కొన్ని ఎలిమెంట్స్ ని ఆడ్ చేశాం.

F2 సీక్వెల్ గురించి…

అప్పుడే అనుకోవట్లేదు. ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి సినిమా చేయాలి.. ఏ సినిమా చేయాలనేది ఫిక్సవుతా… 

సూపర్ స్టార్ కృష్ణ…

సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగారు ఒక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్. ఆయన క్యారెక్టర్ కూడా ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే సినిమా చూడకముందు ఆయన ఈ సినిమాలో ఏం చేశారన్నది కనీసం గెస్ కూడా చేయలేరు…

DSP గురించి…

DSP అంత పాజిటివ్ పర్సన్ ని నేనింతవరకు చూడలేదు. ఈ సినిమాకి ఆయన ఏ సాంగ్ చేసినా సిచ్యువేషన్ కి తగ్గట్టు చేశారు. ఆయన ఏ సాంగ్ చేసినా సినిమాలో సన్నివేశాల్ని ఎలివేట్ చేయడానికే చేశారు…