కాన్ఫిడెన్షియల్ అనిపిస్తున్న మారుతి సినిమా

Friday,March 30,2018 - 01:58 by Z_CLU

మారుతి కాన్సెప్ట్ అందించిన సినిమాకి   ‘భలే మంచి చౌకబేరం’  అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమా మోషన్ టీజర్  ఈ రోజు రిలీజయింది. నవీద్, పార్వతీశం తో పాటు యామినీ భాస్కర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మురళీ కృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

కాన్ఫిడెన్షియల్ సీల్డ్ కవర్ పై బిగిన్ అయిన ఈ మోషన్ టీజర్, పాకిస్తాన్ బార్డర్… వీటి మధ్య ఫోన్ కాల్ లాంటి క్యూరియస్ ఎలిమెంట్స్ తో  మరింత క్యూరాసిటీ ని రేజ్ చేస్తుంది. మారుతి మార్క్ ఒరిజినల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ని రేపు రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. మరి ఈ ట్రైలర్ ని కూడా ఫిల్మ్ మేకర్స్ అంతే కాన్ఫిడెన్షియల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారా..? లేకపోతే సినిమాకి సంబంధించిన కీ ఎలిమెంట్స్ ని రివీల్ చేస్తారా..?  అనేది రేపు తెలిసిపోతుంది.

 

హరి గౌర మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని గుడ్ సినిమా గ్రూప్స్ బ్యానర్ పై ప్రసాద్ ఆరోళ్ళ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.