దిల్ రాజు ఇంటర్వ్యూ

Monday,February 03,2020 - 02:29 by Z_CLU

‘96’ సినిమా తమిళంలో రిలీజ్ కూడా ఆవ్వకముందే ఆ సినిమా సక్సెస్ ని అంచనా వేశాడు దిల్ రాజు. క్షణం కూడా ఆలోచించకుండా సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. అంతే కాన్ఫిడెంట్ గా ‘జాను’ ని ఫిబ్రవరి 7  న రిలీజ్ చేస్తున్నాడు. ‘ఇది నా మనసుకు నచ్చిన సినిమా..’ అని చెప్పుకున్న దిల్ రాజు ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడాడు. అవి మీకోసం…

ఆ ఫీలింగ్ కలగాలి…

ఓ సినిమా చూశామంటే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వకూడదు అనే ఫీలింగ్ కలగాలి. అలా మళయాళ సినిమా ‘బెంగళూర్ డేస్ ‘ సినిమా చూసినప్పుడు అనిపించింది. ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు నాని, శర్వా కూడా ఈ సినిమాకి రెడీ అన్నారు. కాకపోతే ఒక క్యారెక్టర్ దగ్గర ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఎందుకు చెడగొట్టడం అని ఆ ఆలోచనా మానుకున్నా. ఆ తర్వాత ‘ప్రేమమ్’ చేద్దామనుకున్నా. ఈ లోపు నాగవంశీ చేసుకుంటాను అనేసరికి తప్పుకున్నా… ఇప్పుడు కుదిరింది.

ఈ ఏడాది 3 రీమేక్స్…

ఇప్పటి వరకు రీమేక్స్ చేయలేదు. చేయడం మొదలుపెట్టానో లేదో ఇదే ఏడాది ఏకంగా 3 రీమేక్స్… పింక్ రీమేక్ దీంతో పాటు జాను, హిందీలో కూడా జెర్సీ రీమేక్ చేస్తున్నాం. మూడు కూడా హార్ట్ టచింగ్ సినిమాలు.. జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు కావు.

‘జాను’ కోసం…

ఓ ఫిగర్ చెప్పాడు. కానీ నేను దానికి ఓ పది లక్షలు తగ్గించి సినిమా హిట్టయితే ఈ పదిలక్షలు కాదు 25 లక్షలు పంపిస్తానని చెప్పా. సినిమా సక్సెస్ తరవాత ఎగ్జైట్ మెంట్ తో అదే చేశా. నా మనసుకి చాలా నచ్చేసింది ఆ సినిమా. ఆ కథలో ఉన్న ప్యూరిటీకి కనెక్ట్ అయ్యా నేను…

నాని.. బన్ని.. సేమ్ రియాక్షన్…

సినిమా నేను చూసిన తరవాత నానికి చూపించా… చాలా బావుందని చెప్పాడు. ఆ తరవాత బన్నికి చూపించా. ‘క్లాసిక్’ అన్నాడు.. నేను ఎలాగైతే ఈ సినిమాని నమ్మానో.. వాళ్లకు కూడా అదే అనిపించింది.

రెండు చోట్ల చిన్న మార్పు…

తమిళ వర్షన్ కి తెలుగు ‘జాను’ కి ఎక్కడా చేంజెస్ ఉండవు. కాకపోతే తమిళంలో విజయ్ సేతుపతి చాలా స్లోగా మాట్లాడతాడు. తెలుగులో వచ్చేసరికి కొంచెం స్పీడ్ మీటర్ పెంచాం. ఇక చివర్లో ఓ కవిత రాసుకుంటాడు… అదిప్పటికే చాలా పాప్యులర్ అయిపోయింది.  

సమాంత మొదట బయటపడినా …

సమంతా మొదట్లి ఈ సినిమా చేయడానికి భయపడినా, సెట్స్ కి వచ్చిన మొదటి రోజే షూటింగ్ అయిపోయిన తరవాతా మెసేజ్ పెట్టింది. సెట్ లో మ్యాజిక్ జరుగుతుంది అని… ఆ మ్యాజిక్ షూటింగ్ జరిగినన్ని రోజులు ఉంటూనే  ఉంది. కథలోని మేజిక్ కి సమంతా, శర్వాల అనుభవం కూడా జోడైంది. ఆ పాత్రల్లో జీవించేశారు.

అందుకే సమంతా…

తెలుగులో రీమేక్ అనగానే నాకు మైండ్ లో సమంతానే వచ్చింది. త్రిష ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఆల్రెడీ తమిళంలో చూసేశాం. తెలుగులో కూడా త్రిషనే అనుకుంటే ఫ్రెష్ నెస్ ఏముంటుంది.. అందుకే త్రిష అనుకోలేదు.

రీమేక్ రియలైజేషన్…

రీమేక్ అనే కాన్సెప్టే లేకపోతే నాకు బాలీవుడ్ ఎంట్రీ అంత ఈజీ అయి ఉండేది కాదు. రీమేకే చేయకపోతే నా డ్రీమ పవన్ కళ్యాణ్ తో సినిమా పాసిబుల్ అయి ఉండేది కాదు. అది రీమేకా…. స్ట్రేట్ సినిమానా.. అని కాదు. నా పని ఓ మంచి సినిమాని అందించడం అంతే..

40 సినిమాలు బిఫోర్ దసరా…

ఈ దసరా కన్నా ముందే సక్సెస్ ఫుల్ గా 40 సినిమాలు కంప్లీట్ చేశా. నేను నాకు డిస్ట్రిబ్యూటర్ గా కన్నా ప్రొడ్యూసర్ గానే చాలా ఇష్టం.

ప్రభాస్ సినిమాకి టైటిల్ అవసరం లేదు…

ఈ సినిమాకి టైటిల్ అనుకున్న తరవాత ప్రభాస్ సినిమా ప్రొడ్యూసర్స్ తో మాట్లాడా. వాళ్ళు సరే అన్నారు. ఆ సినిమా రావాడానికి ఇంకా టైముంది కాబట్టి టైటిల్ ప్రాబ్లమ్  ఏం ఉండదనిపించింది. అయినా అది ప్రభాస్ సినిమా… ఆయన సినిమాకి టైటిల్ అవసరం లేదు.. ఆయన చాలు…