దిల్ రాజు ఇంటర్వ్యూ

Thursday,January 31,2019 - 12:51 by Z_CLU

‘ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి రావాలి. కథ ఏదైనా అందులో ఇమోషన్స్ మాత్రం కరెక్ట్ గా పండాలి’ ఇవే బ్రాండెడ్  ప్రొడ్యూసర్ దిల్ రాజు సీరియస్ గా పెట్టుకున్న రూల్స్. అందుకే ఆయన ఖాతాలో ఫ్లాప్స్ ఉన్నా, అవి కూడా మంచి  సినిమాల క్యాటగిరీలోకే వస్తాయి.

రీసెంట్ గా ‘F2’ తో గ్రాండ్ సక్సెస్ అందుకుని, మరిన్ని సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్న దిల్ రాజు, మీడియా ఇంటరాక్షన్ లో మనసులోని మరెన్నో మాటల్ని షేర్ చేసుకున్నాడు అవి మీకోసం…  

మ్యాజిక్ రిపీట్ అయింది…

2017 ఎంత సక్సెస్ ఫుల్ గా గడిచిందో, 2019 కూడా అదే స్థాయి సక్సెస్ ని ఇస్తుందనిపిచ్చింది. కొత్త సంవత్సరం బిగినింగ్ లోనే ఇంత పెద్ద సక్సెస్ ని అందించినందుకు అందరికీ పెద్ద థాంక్స్.

F3 2020 లో…

‘F3’ ని 2020 లో ప్లాన్ చేస్తున్నాం కానీ అప్పుడే ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఆల్మోస్ట్ సేమ్ టీమ్ ఉంటుంది. ఈ సారి సినిమాలో ముగ్గురు హీరోలు ఉంటారు. ప్రస్తుతానికి రవితేజ అనుకుంటున్నాం కానీ, ఏదైనా స్క్రిప్ట్ అయిన తరవాతే క్లారిటీ వస్తుంది.

ఈ సారి కూడా సిక్సరా అంటే…

లాస్ట్ ఇయర్ 6 సినిమాలు చేయాలని నేనేమీ అనుకోలేదు, జరిగిపోయింది. అలాగని ఈ ఇయర్ కూడా 6 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయితే, బోల్తా పడే చాన్స్ ఉంది కాబట్టి దాని గురించి అంత ఖచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి 4, 5 స్టోరీస్ అయితే చాన్సెస్ ఉన్నాయి.

96 సినిమా గురించి…

ఈ సినిమా రీమేక్ గురించి మీడియాలో చాలా ఫేక్ న్యూస్ బయటికి వచ్చింది కానీ, అఫీషియల్ గా చెప్పదలుచుకున్నదేమిటంటే తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తాడు. శర్వానంద్, సమంతా లీడ్ రోల్ ప్లే చేస్తారు. నా కరియర్ లో ఇది ఫస్ట్ రీమేక్.

అది నా కాన్ఫిడెన్స్…

‘96’ తమిళంలో క్లాసిక్ సినిమా అనిపించుకుంది. ఇకపోతే తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఫస్ట్ కాపీ చేతికి వస్తే కానీ తెలీదు. నాకైతే సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.

96 సినిమా…

‘96’ ఫీల్ ఉన్న సినిమా. ఓ 2 క్యారెక్టర్స్ మధ్య ఒక జెన్యూన్ ఫీల్ ని దర్శకుడు ట్రావెల్ చేయించిన విధానం నాకు అద్భుతమనిపించింది. ఆ సినిమాని తమిళంలో, చూసీ చూడగానే ప్రొడ్యూసర్ ని కలిసి, ఇమ్మీడియట్ గా డైరెక్టర్ తో ఈ సినిమా తెలుగులో కూడా నువ్వే చేయాలి అనేశా.

F2 సినిమా నాది కాదు…

F2 సినిమా నాది కాదు. అనిల్ రావిపూడిది. నేను జస్ట్ బ్యాకప్ అంతే.

మహేష్ బాబు మహర్షి…

‘మహర్షి’ సినిమా సమ్మర్ కానుకగా రిలీజవుతుంది. ఏప్రిల్ 25 రిలీజ్ డేట్. 

చైతు తో సినిమా…

నాగ చైతన్య తో సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది డిస్కర్షన్ లో ఉన్నాం.

ఇవే రీజన్స్…

స్క్రిప్ట్ స్టేజ్ నుండి ప్రతీది ప్లాన్డ్ గా చేసుకుంటే ప్రతి సినిమా ఆడుతుందనేదే నా నమ్మకం. ఒక్కోసారి స్క్రిప్ట్ వల్ల కావచ్చు, మరోసారి కాస్టింగ్ కుదరక కూడా మిస్ ఫైర్ అవ్వచ్చు. ఒక సినిమా ఆడలేదంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి.