అశ్వథ్థామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,February 03,2020 - 03:24 by Z_CLU

నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ సినిమా బ్రేక్-ఈవెన్ కు దగ్గరైంది. ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్  10 కోట్ల 35 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజుల్లో సినిమాకు 5 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ,నైజాంలో ఈ సినిమా 6 కోట్ల 50 లక్షల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మార్కెట్ లెక్కల ప్రకారం మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి. సో.. ఈ వీకెండ్ కు తెలుగు రాష్ట్రాల్లో అశ్వథ్థామ బయ్యర్లంతా లాభాలు చూసే అవకాశం ఉంది.

అలా కెరీర్ లో మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు నాగశౌర్య. తనే సొంతంగా కథ రాసి, తనే హీరోగా నటించి, తన సొంత బ్యానర్ పై ఈ సినిమా తీసిన నాగశౌర్య.. ఎట్టకేలకు తను అనుకున్నది సాధించాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో రమణతేజ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.