‘జాను’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday,January 31,2020 - 04:49 by Z_CLU

ఫిబ్రవరి 7 న రిలీజ్ కి రెడీ అవుతుంది శర్వా, సమంతాల ‘జాను. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా  ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాని మరింత వైడ్ రేంజ్ లో ప్రమోట్ చేసే ప్లాన్ లో ఉన్న మేకర్స్ ఫిబ్రవరి 1 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్నారు.

తమిళంలో క్లాసిక్ హిట్ అనిపించుకున్న ‘96’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ‘జాను. తమిళంలో ఈ సినిమాని చూసి ఎలాగైనా ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర ఆలోచనతో ఈ సినిమాని నిర్మించాడు దిల్ రాజు. అందుకే తమిళ వర్షన్ లాగే తెలుగు వర్షన్ లో కూడా మ్యాజికల్ ఎమోషన్స్ ఏ మాత్రం చెదరకుండా ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు ఈ ఈవెంట్ లో రివీల్ చేయనున్నారు మేకర్స్. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గోవింద్ వసంత మ్యూజిక్ కంపోజర్.