అల వైకుంఠపురములో 22 రోజుల వసూళ్లు

Monday,February 03,2020 - 02:01 by Z_CLU

బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అల వైకుంఠపురములో. కేవలం అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 3 వారాలు కంప్లీట్ అయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి షేర్స్ వస్తున్నాయి. అలా 22 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 128 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ రాబట్టింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 158 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ప్రీ-రిలీజ్ బిజినెస్ తో కంపేర్ చేసి చూస్తే.. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు రెట్టింపు లాభాలొచ్చాయి. ఓవర్ ఫ్లోస్ మొదలై ఆల్రెడీ వారం రోజులైంది. ఈ వీకెండ్ కూడా ఈ సినిమా హవా నడిచే ఛాన్స్ ఉంది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది.

ఏపీ,నైజాం 22 రోజుల షేర్
నైజాం – రూ. 43.88 కోట్లు
సీడెడ్ – రూ. 18.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.50 కోట్లు
ఈస్ట్ – రూ. 6.30 కోట్లు
వెస్ట్ – రూ. 5.20 కోట్లు
గుంటూరు – రూ. 6.30 కోట్లు
నెల్లూరు – రూ. 2.80 కోట్లు
కృష్ణా – రూ. 5.20 కోట్లు

 

ఇట్స్ అఫీషియల్: నాన్-బాహుబలి రికార్డు బన్నీదే