ధృవ సీక్రెట్స్ పార్ట్-1

Friday,December 02,2016 - 12:20 by Z_CLU

టాలీవుడ్ లో ధృవ మానియా పీక్ స్టేజ్ లో ఉంది. ఓ వైపు డిసెంబర్ 9 న రిలీజ్, దానికన్నా ముందు 4 న జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రెండు గ్రాండ్ అకేషన్స్ ఇస్తున్న ఎగ్జైట్ మెంట్ తో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద్ స్వామి ఇంపాక్ట్ కాస్త భారీగానే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది విలన్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ అరవింద్ స్వామి సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాడు. ఈ బూరె బుగ్గల విలన్ కి సింగర్ హేమచంద్ర డబ్బింగ్ చెప్పడం ఉన్న ఎగ్జైట్ మెంట్ డోసుని డబల్ చేసింది.

ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఏదో చేశాం అని కాకుండా, పోలీస్ లైన్ లో ప్లాన్ చేసిన సినిమా యూనిట్, ఆ ఫంక్షన్ రోజు ఇంకా ఏయే ఎలిమెంట్స్ ప్లాన్ చేసిందోనన్న క్యూరియాసిటీ ధృవ చుట్టూ ధృవంలా తిరుగుతుంది. మరోవైపు పోలీస్ ఆఫీసర్స్ కోసం ప్రత్యేకంగా ఓ ప్రీమియర్ ఏర్పాటుచేసే ఆలోచనలో కూడా చెర్రీ ఉన్నట్టు తెలుస్తోంది.