మిలియన్ డాలర్ క్లబ్ లోకి చెర్రీ

Wednesday,December 14,2016 - 12:00 by Z_CLU

రామ్ చరణ్ ధృవ గోల్ రీచ్ అయిపోయాడు. ఒకప్పుడు సినిమా హిట్టా, ఫట్టా అనే టాక్ మాత్రమే ఉండేది, కానీ కలెక్షన్ల విషయంలో ఫ్యాన్స్ హడావిడి ఎక్కువైపోయింది. అందుకే స్టార్స్ సినిమా సక్సెస్ ని కలెక్షన్స్ తో కొలుస్తున్నారు.

మొత్తానికి హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య, స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ధృవ ఓవర్ సీస్ లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. రిలీజయిన ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ ని కలెక్ట్ చేస్తున్న ధృవ మంగళవారం నాటికి చెర్రీని మిలియన్ డాలర్ క్లబ్ కి క్వాలిఫై చేసేసింది.

బన్నీకి రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన సురేందర్ రెడ్డి, చెర్రీకి కూడా అలాంటి హిట్ నే ఇవ్వడంలో 100 % సక్సెస్ అయ్యాడు.