ధృవ లో ‘8’ ఏంటో తెలిసిపోయింది   

Friday,December 09,2016 - 01:18 by Z_CLU

 తమిళంలో సూపర్ హిట్టయిన ‘తని ఒరువన్’ కి రీమేక్ గా తెరకెక్కిన ధృవ లో ఏ మాత్రం చేంజెస్ చేయలేదు అని ముందుగానే చెప్పేశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కొన్ని రీమేక్స్ కి చేంజెస్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్తూనే, ధృవ లో జస్ట్ 8 అనే ఎలిమెంట్ ని ఆడ్ చేశాం, అది తప్ప సినిమా మొత్తంలో ఎటువంటి చేంజెస్ చేయలేదు అని చెప్పాడు.

ధృవ పోస్టర్ రిలీజయినప్పటి నుండి ‘8’ కి సంబంధించి రకరకాల రూమర్స్ వస్తున్నా, పెద్దగా స్పందించని సినిమా యూనిట్, మెగా ఫ్యాన్స్ కోసం ‘8’  తో పెద్ద సర్ ప్రైజ్ నే ప్లాన్ చేసింది.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ధృవ సెకండాఫ్ మొత్తం ‘8’ గుప్పిట్లోనే నడుస్తుంది. ప్రేక్షకుడిని ఫుల్ టూ ఎగ్జైట్ మెంట్ తో, ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా దిగ్బంధనం చేసే ‘8’  ధృవ సినిమాలో హైలైటెడ్ ఎలిమెంట్.