టాలీవుడ్ లో ఖైదీ ప్రకంపనలు

Friday,December 02,2016 - 01:30 by Z_CLU

ప్రీ-రిలీజ్ బిజినెస్ లో చిరంజీవి సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో హక్కుల విషయంలో కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేసినే ఈ మూవీ… తాజాగా ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. దాదాపు 3 నెలల పాటు జరిగిన హక్కుల యుద్ధంలో, హెవీ కాంపిటిషన్ మధ్య…  క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.. ఖైదీ నంబర్ 150 ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుంది. మెగాస్టార్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం… పైగా ఇది రీఎంట్రీ మూవీ కావడంతో… ఓవర్సీస్ లో ఖైదీ నంబర్ 150కి హెవీ డిమాండ్ ఏర్పడింది.

టాలీవుడ్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నం 150, సంక్రాంతి రిలీజ్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతుంది. ఈలోపు మెగా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్న సినిమా యూనిట్, ఈ సినిమాని డిఫెరెంట్ గా ప్రెజెంట్ గా చేసే విషయంలో ఆల్ రెడీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది. ఈ సినిమాకి రాక్ స్టార్ DSP సంగీతం అందించాడు.