రికార్డులు బ్రేక్ చేస్తున్న ధృవ

Sunday,December 11,2016 - 01:45 by Z_CLU

డీమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా ధృవ కలెక్షన్స్ పై ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో  హౌజ్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకుపోతున్న ధృవ, ఓవర్సీస్ లో దుమ్ము రేపే కలెక్షన్ లతో రికార్డ్స్ సృష్టిస్తుంది. రామ్ చరణ్ కరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ చేస్తున్న ధృవ, తన గత సినిమాలు బ్రూస్ లీ, గోవిందుడు అందరివాడేలేతో పోలిస్తే సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

డిసెంబెర్ 9 న రిలీజైన ధృవ శుక్రవారం లోపు $467,852 కలెక్ట్ చేస్తే, కేవలం శనివారం $265 K వసూలు చేసి రికార్డ్ వసూలుచేసింది. ఈ స్పీడ్ చూస్తుంటే, ధృవ ఈజీగా $ 1 మిలియన్ క్లబ్ లో రీచ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ .