పవన్ సెకెండ్ హీరోయిన్ ఫిక్స్

Friday,December 02,2016 - 10:20 by Z_CLU

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లొకేషన్లు వేదికే పనిలో ఓ టీం దేశాలు చుట్టేస్తోంది. ఇంకో టీం నటీనటుల ఎంపికలో బిజీగాా ఉంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుథ్ ఇప్పటికే ఓకే అయ్యాడు. ఫస్ట్ హీరోయిన్ గా కీర్తి సురేష్ పక్కా అయింది. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేేశాడు త్రివిక్రమ్.

పవన్ మూవీలో సెకెండ్ హీరోయిన్ గా అను ఎమ్మాన్యువేల్ సెలక్ట్ అయింది. గతంలో మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ… ప్రస్తుతం ఆక్సిజన్ సినిమాలో గోపీచంద్ సరసన నటిస్తోంది. కేవలం 2 సినిమాల అనుభవం తోనే పవన్ సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. పవన్ సినిమాకు ఫిక్స్ అయిన భామలిద్దరూ నాని హీరోయిన్లే. అను ఇమ్మాన్యువేల్ మజ్ను సినిమాలో నటిస్తే, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నేను లోకల్ సినిమాలో కీర్తి సురేేష్ నటిస్తోంది.