హై ఎండ్ డిమాండ్ లో ధృవ

Tuesday,January 03,2017 - 01:00 by Z_CLU

హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య డిసెంబర్ 9 న రిలీజైన ‘ధృవ’ సినిమాకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఓవర్సీస్ లో గతంలో ఎన్నడూలేని విధంగా కలెక్షన్లలో రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్న ధృవ, ఇంకా థియేటర్స్ లిస్టు పెంచుకుంటూనే ఉంది. లాస్ట్ వీకెండ్ కి 25 థియేటర్లను పెంచింది సినిమా యూనిట్.

మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 40 కోట్లు షేర్ వసూలు చేసిన ధృవ వరల్డ్ వైడ్ గా 56 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికీ హౌజ్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్న ఈ స్టైలిష్ ఎంటర్ టైనర్.. ఓవర్సీస్ లో 1.5 మిలియన్ వసూళ్లు సాధించే దిశగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది.