'ధృవ' 5 డేస్ కలెక్షన్స్...

Thursday,December 15,2016 - 06:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో సత్తా చాటుతున్నాడు. చెర్రీ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటించిన లేటెస్ట్ సినిమా ‘ధృవ’ ఫస్ట్ డే నుంచే పాజిటీవ్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా ముందకెళ్తూ ఈ సినిమా 5 రోజుల్లోనే దాదాపు 30 మార్క్ కి చేరుకుంది.. ఓ వైపు నోట్ల రద్దు తో ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్స్ అందుకుంటుంది . తొలి ఐదు రోజులకు ఈ సినిమా నైజాంలో 10.24 కోట్ల షేర్ అందుకోగా సీడెడ్ లో 4 .92 కోట్లు, ఉత్తరాంధ్రలో 3 .74 కోట్లు , వెస్ట్ గోదావరి లో 1 .99 కోట్లు, ఈస్ట్ గోదావరి లో 2 .28 కోట్లు  కృష్ణా లో 2 .11 కోట్లు , గుంటూరు లో 2 .49 కోట్లు నెల్లూరు లో 94 లక్షల తో కలిపి మొత్తంగా 28 .71 కోట్లు సాధించి మెగా స్టామినా తో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. మరి ఇదే స్పీడ్ తో సంక్రాంతి వరకూ దూసుకెళ్తే ‘ధృవ’ 50 కోట్ల మార్క్ అవలీలగా దాటేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు