దూసుకుపోతున్న ధృవ

Monday,December 26,2016 - 08:01 by Z_CLU

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ వరల్డ్ వైడ్ దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే మిలియన్ క్లబ్ లోకి సగర్వంగా ఎంటరైన ఈ సినిమా తాజాగా మరిన్ని డాలర్లను తన ఖాతాలో వేసుకుంది. తాజా లెక్కల ప్రకారం… ధృవ సినిమా ఇప్పటివరకు ఓవర్సీస్ లో 13లక్షల 50వేల 2వందల డాలర్లు ఆర్జించింది. చరణ్ కెరీర్ లోనే ఇది అతిపెద్ద ఓవర్సీస్ రికార్డు. ఈ వీకెండ్ కూడా ఈ సినిమా స్ట్రాంగ్ కలెక్షన్లు తీసుకొస్తుందని ఓవర్సీస్ బయ్యర్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధృవ మేనియా కొనసాగుతోంది. ఇప్పటికే 50కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా రోజురోజుకు తన లెక్కను పెంచుకుంటూ పోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు.