మళ్ళీ గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్

Tuesday,January 03,2017 - 02:00 by Z_CLU

సూపర్ స్టార్ మళ్ళీ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హై ఎండ్ టెక్నికల్ వెంచర్ 2.0 తో బిజీగా ఉన్న రజనీకాంత్… ఈ సినిమా తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా మళ్ళీ సెట్స్ పైకి రానున్నాడు.

రజనీకాంత్ కెరియర్ లో ఎన్ని సినిమాలున్నా గ్యాంగ్ స్టర్ గా లీడ్ చేస్తూ చేసిన సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది, లాస్ట్ టైం రిలీజ్  అయిన కబాలి మిక్స్డ్ వ్యూస్ తో ముగించినప్పటికీ… ఏకంగా 300 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

కబాలి డైరెక్టర్ పా. రంజిత్ డైరెక్షన్ లోనే మరోసారి నటించనున్న రజినీ కాంత్ సినిమాని ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని మ్యాగ్జిమం ముంబై లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.