చరణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు...

Monday,December 19,2016 - 11:03 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ధృవ సినిమా విషయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. చరణ్ కు ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అవి. ఆనందబాష్పాలు అంటారు కదా అవన్నమాట. ఇంతకీ మేటర్ ఏంటంటే… ధృవ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అన్ని ఏరియాస్ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఓవర్సీస్ లో కూడా చెర్రీని మిలియన్ డాలర్ హీరోగా నిలబెట్టింది. అయితే వీటన్నింటి కంటే తండ్రి మెగాస్టార్ చిరంజీవి అభినందనే, చెర్రీని ఎక్కువగా కదిలించింది. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా వెల్లడించాడు.
ramcharan-chiranjeevi-zee-cinemalu
తన సినిమాలకు సంబంధించి ఎప్పుడూ డాన్స్ బాగుందని, ఫైట్స్ బాగుందని మెచ్చుకునే చిరంజీవి.. ధృవ విషయంలో మాత్రం తన యాక్టింగ్ ను మెచ్చుకున్నారని చరణ్ ఆనందంగా ప్రకటించాడు. కథ ప్రకారం.. అద్భుతంగా నటించావని తండ్రి మెచ్చుకున్నప్పుడు తనకు కన్నీళ్లు ఆగలేదని చెర్రీ మీడియాతో చెప్పాడు. నిజమే, ధృవ సినిమాలో చరణ్.. ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. తండ్రి మెచ్చుకోలుతో ఇప్పుడా కష్టమంతా మరిచిపోయాడు.