జూలై బాక్సాఫీస్ రివ్యూ

Wednesday,July 31,2019 - 10:02 by Z_CLU

జూలై బాక్సాఫీస్ ఇంట్రెస్టింగ్ గా ముగిసింది. ఈ నెలలో 13 సినిమాలు రిలీజయ్యాయి. కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ కి మించి సక్సెస్ ని అందుకుంటే, కొన్ని సినిమాలు ఫస్ట్ వీకెండ్ ని కూడా సక్సెస్ ఫుల్ గా ఈదలేకపోయాయి. ఓవరాల్ గా జూలై నెలలో రిలీజైన సినిమాల బాక్సాఫీస్ రివ్యూ..

ఓ బేబీ.. బుర్రకథ… దుర్మార్గుడు… 3 సినిమాలు ఒకే రోజున రిలీజయ్యాయి. సమంతా ‘ ఓ బేబీ’ సినిమా రిలీజైన రోజు నుండే స్పీడ్ అందుకుంటే ఆది ‘బుర్రకథ’ సినిమా, ఈ యంగ్ హీరోలోని మరో కోణాన్ని బయట పెట్టింది. ఓవరాల్ గా ఈ 3 సినిమాల్లో పాసైన సినిమాలు ఇవి రెండే… ‘దుర్మార్గుడు’ సినిమా కనీసం పాజిటివ్ బజ్ ని కూడా స్ప్రెడ్ చేయలేకపోయింది.

 

ఇక సెకండ్ వీకెండ్ బడా స్టార్స్ హడావిడి లేకపోయినా సెలెబ్రిటీ కిడ్స్ కార్నర్ నడిచింది. రిలీజ్ కి ముందే రాజ్ దూత్, దొరసాని అటెన్షన్ ని గ్రాబ్ చేసినా, బాక్సాఫీస్ దగ్గర రూల్ చేయడానికి వీళ్ళకు ఇంకాస్త టైమ్ పడుతుందనిపించింది. ఇక సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’… చుట్టూ ఎక్స్ పెక్టేషన్స్ పెద్దగా లేకపోయినా ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయింది. ఇక R. నారాయణ మూర్తి ‘మార్కెట్ లో ప్రజాస్వామ్యం’ ఈ ఎంటర్ టైనింగ్ సినిమాల ముందు గట్టిగా నిలబడలేకపోయింది. ‘KS100’ అట్టర్ ఫ్లాప్.

 

ఇక థర్డ్ వీకెండ్ ‘ఇస్మార్ట్ శంకర్’ కంప్లీట్ గా ఆక్యుపై చేసుకుంది. ఈ సినిమా అందుకున్న సక్సెస్ ఇంపాక్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ పైనే కాదు.. ఆ వీకెండ్ రిలీజైన మిగతా సినిమాలపై కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ రోరింగ్ సౌండ్ లో అమలాపాల్ ‘ఆమె’, మిస్టర్ KK… తేలిపోయాయి.

విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ తో అంచనాలు ఈజీగా అందుకున్నాడు. ఈ వీకెండ్ పెద్దగా ఈ రౌడీకి పెద్దగా కాంపిటీషన్ లేకపోయినా, కాస్త కాన్ఫిడెంట్ గా రిలీజ్ అయిన ‘నేనులేను’ నిలబడలేకపోయింది.