‘డియర్ కామ్రేడ్’ తో మరో అడుగు...

Friday,July 19,2019 - 03:03 by Z_CLU

ఒక్కో సినిమాతో జస్ట్ సక్సెస్ రేషియోనే పెంచుకోవట్లేదు విజయ్ దేవరకొండ. వీలైనంత వరకు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. గతంలో ‘నోటా’ తో తమిళ సినిమాకి ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ తో కన్నడ సినిమాకి పరిచయం అవుతున్నాడు. 

విజయ్ దేవరకొండ జస్ట్ యాక్టింగ్ చేసి పనై పోయిందనుకోడు.. ప్రమోషన్స్ లో అంతే యాక్టివ్ గా పార్టిసి పెట్ చేస్తాడు… ఆడియెన్స్ కి సినిమాని రీచ్ చేసే ప్రాసెస్ విజయ్ కన్నా గొప్పగా ఇప్పటి యంగ్ హీరోస్ ఎవరికీ తెలీదనే చెప్పాలి… ఆ విషయం ‘డియర్ కామ్రేడ్’ సినిమాని గమనిస్తేనే అర్థమవుతుంది.

 

తెలుగులో ఒక సాంగ్ ని తానే పాడి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, అదే తమిళ, కన్నడ భాషల వరకు వచ్చేసరికి విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ తో పాడించుకున్నాడు. సినిమాని ఆడియెన్స్ లోకి వైడ్ రేంజ్ లోకి రీచ్ అయ్యేలా ఇంతకన్నా గొప్ప ఆలోచన ఉంటుందా…? 

తమిళంలో ఎలాగూ విజయ్ అందరికీ పరిచయమే. ఇక ఈసారి కన్నడ వరకు వచ్చేసరికి రష్మిక ఎలాగూ ఉంది… ఓపెనింగ్స్ రష్మికకి ఉన్న క్రేజ్ వల్ల జరిగినా… ఆ తరవాత స్టాంప్ వేసేది విజయ్ దేవరకొండనే… ఇలా పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఈ సినిమాతో మరో అడుగు వేస్తున్నాడు విజయ్ దేవరకొండ.