బాగా ఎంజాయ్ చేస్తున్నారు -మధుర శ్రీధర్

Tuesday,May 21,2019 - 02:20 by Z_CLU

అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ABCD’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తూ పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఆ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన మధుర శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మధుర శ్రీధర్ మాటల్లోనే…

నిర్మాతగా చాలా హ్యాపీ

కలెక్షన్స్ పరంగా సినిమా స్టడీగా ఉంది. ఏ సినిమాకైనా సోమవారం అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తేలేది ఆ రోజే.. అందుకే నిన్న కలెక్షన్స్ చూసాకే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఆ హ్యాపీ నెస్ పంచుకోవడానికే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ డే మేం ఊహించని విధంగా ‘శ్రీరస్తు శుభమస్తు’ , ‘ఒక్క క్షణం’ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఈ వారం సినిమా మంచి కలెక్షన్స్ సాదిస్తుందనే నమ్మకం వచ్చింది. నిర్మాతగా చాలా హ్యాపీ “

ఎంజాయ్ చేస్తున్నారు

రిలీజ్ తర్వాత కొన్ని థియేటర్స్ కెళ్ళినప్పుడు.. ఆడియన్స్ చిన్న చిన్న సీన్స్ కి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భరత్ ఒక టేబుల్ కింద దూరి చెప్పే డైలాగ్ కి కూడా విపరీతంగా నవ్వుతుంటే హ్యాపీ గా అనిపించింది. వాళ్ళ ఎంజాయ్ మెంట్ చూసి మేం అనుకున్నది రీచ్ అయ్యాం అనే ఫీలింగ్ కలిగింది.

కొన్ని సార్లు తప్పదు

సినిమాలో కొన్ని సన్నివేశాలతో పాటు ‘ముంత కళ్ళు’ అనే సాంగ్ కూడా ఎడిట్ లో తొలగించాం. నిజానికి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి ఎక్కువ టైం తీసుకోకూడదు అందువల్లే ఖర్చు పెట్టి తీసిన సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ ని కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించాం. కొన్ని సార్లు అలా చేయక తప్పదు.”

 

ముగ్గురు హీరోలు గుర్తొచ్చారు

ABCD సినిమాలో పొలిటికల్ డ్రామాతో పాటు ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గ ఫన్ ఉంది.. అందుకే ఫస్ట్ టైం రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాం. సినిమా చేద్దాం అనుకోగానే నాకో ముగ్గురు హీరోలు గుర్తొచ్చారు. కానీ కథ పరంగా చూస్తే ఎక్కువ శాతం శిరీష్ పర్ఫెక్ట్ అనిపించాడు. శ్రీరస్తు శుభమస్తు లో శిరీష్ కామిక్ టైమింగ్ బాగుంటుంది. అందుకే తనే బెస్ట్ అనిపించింది. శిరీష్ కూడా ABCD రీమేక్ అనగానే ఎగ్జైట్ అయ్యాడు. ఎప్పటి నుండో తను కూడా ఆ రీమేక్ చేయలనుకున్నారట. మేం అనుకున్నట్లే క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించుకున్నాడు.”

వర్కౌట్ అవ్వదేమో 

ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఓ వీడియో చూసి వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్  క్రియేట్ చేశాం. అయితే ట్రాక్ చెప్పగానే కిషోర్ అందరూ చూసేసారు కదండీ వర్కౌట్ అవ్వదేమో అనే డౌట్ ఎక్స్ ప్రెస్ చేసాడు. కానీ నేనే పట్టుబట్టి కచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పి నా కోసం చేయమని అడిగాను. వెంటనే సరే అని ఆ క్యారెక్టర్ చేసాడు. ఈ రోజు థియేటర్స్ లో ఆ కామెడీ సీన్స్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది. వెన్నెల కిషోర్ చేయడం వల్లే ఆ సన్నివేశాలు బాగా పేలాయి.

భరత్ … ఊహించని విధంగా

భరత్ రోల్ కోసం ముందుగా వెన్నెల కిషోర్ ని అనుకున్నాం. కానీ వెన్నెల కిషోర్ వయసు ఎక్కువవుతుందేమో అనిపించింది. తను కూడా అదే ఫీలయ్యాడు. పైగా ఆ క్యారెక్టర్ కోసం దాదాపు 70 రోజుల డేట్స్ కావాలి. ప్రస్తుతం బిజీ షెడ్యుల్ లో అన్ని డేట్స్ అంటే కష్టమే. ఆ తర్వాత మా ఛాయిస్ భరత్. మేం ఊహించని విధంగా క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించాడు. షూటింగ్ లో తను చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు. తను చేసిన సన్నివేశాలను మానిటర్ లో కూడా చూసేవాడు కాదు. ఇప్పుడు తన కామెడీ కి థియేటర్స్ లో భలే ఎంజాయ్ చేస్తున్నారు. తనకి మంచి భవిష్యత్తు ఉంది. కచ్చితంగా ప్రామిసింగ్ హీరో అవుతాడు.