2.0 లో అక్షయ్ కుమార్ క్యారెక్టర్ పై క్యూరియాసిటీ

Tuesday,November 27,2018 - 04:50 by Z_CLU

రజినీకాంత్ 2.0 లో మోస్ట్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు అక్షయ్ కుమార్. ఇప్పటి వరకు రిలీజైన ట్రైలర్స్ ని బట్టి ఆడియెన్స్ మైండ్ లో ఉన్న ఇమాజినేషన్ ఇదే. అయితే అక్షయ్ కుమార్ ప్లే చేసింది విలన్ రోలా కాదా..? ఈ సినిమా ప్రమోషన్  లో భాగంగా మేకర్స్ రివీల్ చేసిన విషయాల్ని బట్టి, ఆడియెన్స్ లో రేజ్ అవుతున్న కొత్త క్వశ్చన్ ఇది.

రజినీకాంత్ తరవాత సినిమాలో అంతే పవర్ ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాడు అక్షయ్ కుమార్. అయితే అక్షయ్ ప్లే చేసిన క్యారెక్టర్ జస్ట్ ‘విలన్’ పరిధుల్లోనే ఉండదని, ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేయని ఎలిమెంట్స్ ఈ క్యారెక్టర్ చుట్టూ ఉండబోతున్నాయని  చెప్పుకున్నారు మేకర్స్. దాంతో ఆడియెన్స్ క్యూరియాసిటీ అక్షయ్ కుమార్ క్యారెక్టర్ పై నిలుస్తుంది.

ఈ సినిమా కోసం డైలాగ్స్ కోసం అవసరం అనుకున్న చోట తమిళం నేర్చుకుని మరీ ఈ సినిమాలో నటించిన  అక్షయ్ కుమార్, ఈ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉండబోతున్నాయని చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్లే చేసిన రోల్ ఎగ్జాక్ట్ డీటేల్స్ తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే.