సాహో సెట్స్ లో శ్రద్ధాకపూర్ ఫుడ్ ఫెస్టివల్

Tuesday,November 27,2018 - 04:58 by Z_CLU

సాహో హీరోయిన్ శ్రద్ధాకపూర్ కు భీమవరం రుచులు కొత్తకాదు. ప్రభాస్ తో పరిచయమైన వెంటనే భీమవరం రుచులు కూడా పరిచయమైపోయాయి. సెట్స్ పై శ్రద్ధ ఉందంటే చాలు, ప్రత్యేక వంటకాలు వచ్చేస్తుంటాయి. ఈ విషయాన్ని గతంలో ఓసారి శ్రద్ధానే స్వయంగా బయటపెట్టింది. ఈసారి ఏకంగా ఓ పిక్ రిలీజ్ చేసింది.

సాహో సెట్స్ లో ఉన్న తనకు మరోసారి రాయల్ మీల్స్ లభించిందంటూ పోస్ట్ పెట్టింది శ్రద్ధ. వెజ్, నాన్-వెజ్ వంటకాలతో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. శ్రద్ధ ఎప్పుడు సెట్స్ పైకొచ్చినా ఆమెకు ఇలా ఆంధ్రా వంటకాలతో భోజనం వడ్డిస్తున్నారు.

నిజానికి సాహో సినిమాకు సంబంధించి శ్రద్ధాకపూర్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. అయినప్పటికీ కొన్ని కాంబినేషన్ సీన్స్ విషయంలో అవసరమైనప్పుడు సెట్స్ కు వస్తూనే ఉంటుంది శ్రద్ధ. అలా వచ్చినప్పుడల్లా ఇలా ఆంధ్రా వంటకాల్ని, భీమవరం రుచుల్ని టేస్ట్ చేస్తూనే ఉంటుంది.