ఆ భరోసా కలిగించింది శ్రీను వైట్లే

Saturday,April 08,2017 - 05:00 by Z_CLU

ఒక రకంగా చెప్పాలంటే బ్రూస్ లీ సినిమాతోనే నా రి ఎంట్రీ జరిగిందని. శ్రీను వైట్లే రి ఎంట్రీ పై తనకు భరోసా అందించాడని అని తెలిపాడు చిరంజీవి.. లేటెస్ట్ గా జరిగిన మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శ్రీను వైట్ల గురించి చిరంజీవి మాట్లాడుతూ ” డైరెక్టర్ శ్రీను వైట్ల అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను కామెడీ ని బాగా ఇష్టపడతాను. అలాంటి కామెడీ సిఎంమాలతో ఎంటర్టైన్ చేసే డైరెక్టర్ శ్రీనువైట్ల. మా ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అందరి వాడు’ తీసినప్పుడు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఆ తరువాత ఆతని కాంబినేషన్ లో చేయడం మళ్ళీ కుదరలేదు. కానీ బ్రూస్ లీ లో ఒక కామియో రోల్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ చెయ్యాలని పట్టు పట్టింది శ్రీను వైట్ల. నిజానికి చాలా కాలం తర్వాత రి ఎంట్రీ ఇచ్చిన  నాకు అదొక మచ్చు తునక గా నిలిచింది. నాకు ఆ గెస్ట్ రోల్ ఇచ్చి ఆ పరవాలేదు మనం మళ్ళీ సినిమా చేయొచ్చు అంటూ ఓ భరోసా కలిగించిన వ్యక్తి శ్రీను వైట్ల.. ఈ సందర్భంగా శ్రీను కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ” అని తెలిపాడు చిరు.