అఖిల్ ఏ రీమేక్ చేస్తే బాగుంటుంది..?

Saturday,April 08,2017 - 03:00 by Z_CLU

ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం అఖిల్ ఫ్యూచర్ సినిమాలపైనే. అఖిల్, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబోలో  తెరకెక్కుతున్న సినిమా హాట్ టాపిక్. ఈ సినిమా సబ్జెక్ట్ ఏమై ఉంటుందా అనే విషయంలో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు కానీ, అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ టాలీవుడ్ బెస్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోయిన సినిమాల రీమేక్ లో నటిస్తే ఎలా ఉంటుందా అని ఇమాజిన్ చేయడం స్టార్ట్ చేసేశారు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ హ్యాండ్సమ్ హీరో ఏ రీమేక్స్ చేస్తే బాగుంటుందో ఓ లుక్కేద్దాం

remake-1

కింగ్ నాగార్జున కరియర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నా, శివ సినిమాది స్పెషల్ ప్లేస్. చిన్న సైకిల్ చెయిన్ తో టాలీవుడ్ కి సరికొత్త స్టాండర్డ్స్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాని అఖిల్ రీమేక్ చేయాలని ఫ్యాన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్. వాళ్ళు ఫీలయ్యారని కాదు కానీ, అఖిల్ సినిమాతో లవర్ బాయ్, యాక్షన్ హీరో ఇమేజ్ లను బాక్స్ లో వేసుకున్న అఖిల్… ఈ సినియా రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది.

remake-2

నాగ్ కరియర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హలో బ్రదర్. ఈవీవీ సత్యనారాాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ లో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. అఖిల్ గాని ఈ సినిమాకి సంతకం చేస్తే, ఒకేసారి రెండు వేరియేషన్స్ లో అఖిల్ ని చూసేయొచ్చు.

remake-3

1989 లో మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన గీతాంజలి రిలీజై పాతికేళ్ళు గడిచినా అంతే ఫ్రెష్ గా ఉంది. ప్రతి జెనెరేషన్ కి అది హాట్ ఫేవరేట్ సినిమా. అఖిల్ ఈ సినిమా రీమేక్ చేస్తే హాట్ టచింగ్ లవ్ ఎంటర్ టైనర్ అతడి అకౌంట్ లో పడ్డట్టే.

remake-4

నాగార్జున కరియర్ లో బిగ్గెస్ట్ కలర్ ఫుల్ ఎంటర్ టైనర్ ఘరానా బుల్లోడు. ఈ ఫుల్  లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ ను అఖిల్ రీమేక్ చేస్తే కచ్చితంగా అది అక్కినేని ఫ్యాన్స్ కు స్పెషల్ మూవీ అవుతుంది.

remake-5

NTR, ANR కాంబోలో తెరకెక్కిన గుండమ్మ కథ ఆల్ టైం క్లాసిక్ లిస్టులో ఎప్పటికీ ఉండిపోతుంది. ఫ్యూచర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా, ఆ ప్లేస్ చెక్కు చెదరదు. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు గుండమ్మకథలో మార్పులు చేస్తే అదిరిపోయే హిట్ గ్యారెంటీ. అఖిల్ తో పాటు.. పనిలోపనిగా  చైతూ కూడా ఈ సినిమాకి సంతకం చేస్తే.. ‘మనం’ టైపు మల్టీస్టారర్ కి బోలెడంత స్కోప్ ఉంటుంది.

remake-6

ANR కరియర్ లో బోలెడంత కలర్ నింపిన సినిమా దసరా బుల్లోడు. తాతగారి కరియర్ లో లైఫ్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో మన మోడ్రన్ బుల్లోడు గాని నటిస్తే, ఆ సినిమాకి పెద్ద ట్రిబ్యూట్ ఇచ్చినట్టే.

remake-7

ఆల్ టైం క్లాసిక్స్ లో అప్పర్ రో లో ఉంటుంది మాయా బజార్. అలాంటి క్లాసిక్ సినిమాకి రీమేక్ అంటే కాస్తంత పెద్ద రెస్పాన్సిబిలిటీనే అయినా, హై ఎండ్ టెక్నీషియన్స్ ఉన్న టాలీవుడ్ కి ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ అయితే కాదు. అయితే ఫ్యాన్స్ రీమేక్స్ లిస్ట్ లో ఈ సినిమా ఉన్నప్పటికీ… లెజెండ్ ఏఎన్నార్ నటించిన ఈ సినిమాను రీమేక్ చేసే సాహసం మాత్రం ఎవరూ చేయరు.