జీ సినిమాలు ( ఏప్రిల్ 9th)

Saturday,April 08,2017 - 10:35 by Z_CLU

హీరోహీరోయిన్లు – కృష్ణుడు, శ్రద్ధ ఆర్య

నటీనటులు – ఏవీఎస్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎల్బీ శ్రీరాం, ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, హేమ, హర్షవర్థన్

సంగీతం – మణిశర్మ

దర్శకత్వం – ఏవీఎస్

విడుదల తేదీ – 2010, జులై 30

రూమ్ మేట్స్, సూపర్ హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారంకాను లాంటి సినిమాలతో అప్పటికే దర్శకుడిగా మారిన ఎవీఎస్.. కృష్ణుడితో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ తెరకెక్కిన ఆ సినిమానే కోతిమూక. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య హీరోహీరోయిన్లు అయినప్పటికీ.. కథ ప్రకారం ఇందులో చాలామంది హీరోలు కనిపిస్తారు. అందరూ కడుపుబ్బా నవ్విస్తారు. ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం.. ఇలా ఈ హాస్యనటులంతా పండించిన కామెడీనే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు మణిశర్మ అందించిన పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.

==============================================================================

నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. శంకర్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 30 మార్చి 2006

అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.

==============================================================================

నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కినజై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

=============================================================================

నటీనటులు : శ్రీహరి, సుహాసిని

ఇతర నటీనటులు : షామ్న, సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఫైట్ మాస్టర్ విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ యాక్షన్  థ్రిల్లర్ గా నిలిచింది శ్రీ మహాలక్ష్మి. శ్రీహరి లాయర్ గా నటించిన సినిమాకి ఫైట్ మాస్టర్ విజయన్ డైరెక్టర్. ఆద్యంతం కట్టి పడేసే సస్పెన్స్ సినిమాలో హైలెట్.

============================================================================

నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత

ఇత నటీనటులు : తేజస్వి మాడివాడ, చాందిని, షామిలి అగర్వాల్, సప్తగిరి, సాయి కుమార్ పంపన, MS నారాయణ, దువ్వాసి మోహన్ & అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : జీవన్ బాబు

డైరెక్టర్ : హరినాథ్

ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగస్వామి & B. మహేంద్ర బాబు

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2014

గర్ల్ ఫ్రెండ్ కోసం ఆరాటపడుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేసే సిద్దూ ఎఫర్ట్స్ చిత్ర వల్ల స్పాయిల్ అయిపోతాయి. అప్పటి వరకు తనను ఒక్కసారి కూడా చూడని సిద్దు, ఫోన్ లోనే చిత్రతో గొడవ పడతాడు. మరో వైపు ఇంకో అమ్మాయితో సిన్సియర్ గా లవ్ లో పడతాడు. తరవాత ఏం జరిగిందనేది ప్రధాన కథాంశం.

==============================================================================

నటీ నటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రంయుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే అమ్మాయి ఇద్దరి సహాయం తో స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

============================================================================

నటీనటులు : జాకీచాన్, అంబర్ వ్యాలెట

ఇతర నటీనటులు : మాగ్నస్ షేవింగ్, మ్యడేలిన్ క్యారోల్, విల్ శ్యాడ్, అలినా ఫోలి, జార్జ్ లోపెజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : డేవిడ్ న్యూమెన్

డైరెక్టర్ : బ్రయన్ లీవెంట్

ప్రొడ్యూసర్ : రాబర్ట్ సైమండ్స్

రిలీజ్ డేట్ : జనవరి 15, 2010

జాకీచాన్ నటించిన అద్భుత కామెడీ చిత్రం స్పై నెక్స్ట్ డోర్. బ్రైన్ లీవెంట్ దరేక్షన్ చేసిన సినిమాని రాబర్ట్ సైమండ్స్ నిర్మించాడు. డేవిడ్ న్యూమెన్ సంగీతం అందించిన సినిమాలో అంబర్ వ్యాలెట హీరోయిన్ గా నటించింది. కామెడీ సినిమాలో హైలెట్ గా నిలిచింది.