షాకిచ్చిన చైతు...

Monday,July 03,2017 - 12:49 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఉన్నట్టుండి అందరికి షాక్ ఇచ్చి షేక్ చేశాడు. రీసెంట్ గా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన చైతు ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి ఇంకా రెండు నెలలు కూడా అవ్వకుండానే మరో సినిమాను థియేటర్స్ లో తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయాడు అక్కినేని హీరో..

ప్రెజెంట్ కృష్ణ మరిముత్తు డైరెక్షన్ లో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్న చైతు ఈ సినిమాకి ‘యుద్ధం శరణం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకొని ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియా లో హంగామా చేస్తూ ట్రెండ్ అయ్యాడు. అయితే ఉన్నట్టుండి సడెన్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన ఆగస్టు లో ఈ సినిమాతో థియేటర్ రాబోతున్నట్లు చైతు అనౌన్స్ చేయడం తో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆడియన్స్. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పక్కాగా ప్లాన్ చేసుకోవడం, ‘రారండోయ్’ సెట్స్ పై ఉండగానే చైతు ఈ సినిమా సెట్స్ పై పెట్టేయడంతో షూట్ అనుకున్న సమయానికే పూర్తి చేశారట. ఇక ఇదే స్పీడ్ తో చైతు సినిమాలు చేస్తే అక్కినేని ఫ్యామిలీ నుంచి నెలల గాప్ లోనే సినిమాలు థియేటర్స్ లో సందడి చేసే ఛాన్స్ ఉంది..