మరో మాసివ్ డైరెక్టర్ తో సూపర్ స్టార్

Monday,July 03,2017 - 12:13 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీ బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, A.R. మురుగదాస్ ‘స్పైడర్’ కి సరిగ్గా ప్యాకప్ కూడా చెప్పలేదు, అంతలో దొరికిన కాస్తంత గ్యాప్ లో కొరటాల సినిమాతో  సెట్స్ పైకి వచ్చేశాడు. మరోవైపు తన 25 వ ల్యాండ్ మార్క్ మూవీని వంశీ పైడిపల్లి తో ఆల్ రెడీ ఫిక్సయిపోయాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా బిగిన్ అయిపోయాయి.

ముందుగా స్పైడర్, ఆ తరవాత  కొరటాల మూవీ, ఇమ్మీడియట్ గా వంశీ పైడిపల్లి సినిమా… ఇవి ప్రస్తుతానికి మహేష్ బాబు డైరీ లో క్యూ కట్టిన భారీ బడ్జెట్ సినిమాలు. అయితే అంతలో ఈ క్యూ లో మాసివ్ డైరెక్టర్ బోయపాటి కూడా ఉన్నాడనే అన్ అఫీషియల్ అప్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ సైడ్ సోర్సెస్ ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ‘జయ జానకి నాయకా’ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్న బోయపాటి, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా మెగాస్టార్ 152 వ సినిమాతో బిజీ కాబోతున్నాడు. ఇక సూపర్ స్టార్ తో ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్స్ గాని సక్సెస్ అయితే, మెగాస్టార్ వెంచర్ తరవాత ఇమ్మీడియట్ గా సూపర్ స్టార్ కి యాక్షన్ చెప్పేస్తాడు బోయపాటి.