జగన్నాథమ్ కోసం స్పెషల్ ట్రయినింగ్

Tuesday,June 20,2017 - 10:52 by Z_CLU

డీజే-దువ్వాడ జగన్నాథమ్.. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. కానీ రెగ్యులర్ గా చేసే క్యారెక్టర్లకు, బ్రాహ్మణ పాత్రకు చాలా తేడా ఉంది. పైగా బన్నీ ఇప్పటివరకు చేయని పాత్ర ఇది. అందుకే ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్ కోచింగ్ తీసుకున్నాడు అల్లువారబ్బాయ్.

డీజే సినిమాకు ముందు బ్రాహ్మణుల్ని తను ఎప్పుడూ క్లోజ్ గా గమనించలేదని అంటున్నాడు బన్నీ. కేవలం డీజే సినిమా కోసం కొంతమంది బ్రాహ్మాణులు వద్ద శిక్షణ తీసుకున్నానని తెలిపాడు. వాళ్ల వాచకం, మేనరిజమ్స్ ను దగ్గరుండి పరిశీలించానని.. ఇలా డీజే సినిమా కోసం 10 రోజుల పాటు బ్రాహ్మణుల వద్ద శిక్షణ తీసుకున్నానని తెలిపాడు బన్నీ.

కేవలం బ్రాహ్మణ గెటప్ కోసమే కాకుండా.. వంటలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు బన్నీ. ఈ సినిమాలో బ్రాహ్మణ వంటవాడిగా కనిపించబోతున్నాడు బన్నీ. అప్పటివరకు తినడమే తప్ప వంట గురించి ఏమీ తెలీదన్న బన్నీ.. ఈ సినిమా కోసం వంటలు ఎలా వండుతారో గమనించానని అంటున్నాడు. ఈ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది డీజే సినిమా.