ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పనున్న బన్నీ

Monday,June 26,2017 - 12:52 by Z_CLU

థియేటర్లలోకి వచ్చిన డీజే సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి ఈ సినిమా. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సరైనోడు రికార్డుల్ని ఒక్కొక్కటిగా క్రాస్ చేస్తోంది దువ్వాడ జగన్నాథమ్ సినిమా. కంప్లీట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సందర్భంగా.. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు బన్నీ. అందుకే థ్యాంక్ యు ఫంక్షన్ పెట్టాడు.

హైదరాబాద్ జేఆర్కీ కన్వెన్షన్ హాల్ లో మరికొన్ని గంటల్లో ‘థాంక్ యు మీట్’ ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్ లో దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించి ముఖ్యమైన యూనిట్ సభ్యులంతా పాల్గొంటారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది డీజే సినిమా. అవినీతి, అక్రమాల్ని అరికట్టే డీజేగా, వంటలు చేసే బ్రాహ్మణుడు దువ్వాడ జగన్నాథమ్ గా.. రెండు డిఫరెంట్ షేడ్స్ లో బన్నీ అదరగొట్టేశాడు.