డీజే 2 రోజుల వసూళ్లు

Sunday,June 25,2017 - 03:20 by Z_CLU

దువ్వాడ జగన్నాథమ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాడు. ఈ సీజన్ లో బాహుబలి-2 తర్వాత హయ్యస్ట్ కలెక్షన్లు డీజే సినిమాకే వస్తున్నాయి. మొదటి రోజు వసూళ్లతో మొనగాడు అనిపించుకున్న బన్నీ.. సెకెండ్ డే కూడా అదే జోరు చూపించాడు. తన మార్కెట్ స్టామినా ఏంటో రుచిచూపించాడు. ఈ 2 రోజుల్లో.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే డీజే సినిమా 26 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించిందంటే.. ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అటు ఓవర్సీస్ లో కూడా డీజే సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి.

ఏపీ, తెలంగాణలో 2 రోజుల వసూళ్లు (షేర్)..

నైజాం –    8.32 కోట్లు
సీడెడ్ –    4.05 కోట్లు
నెల్లూరు –  1.33 కోట్లు
గుంటూరు – 2.80 కోట్లు
కృష్ణా –    1.61 కోట్లు
వెస్ట్ –    2.41 కోట్లు
ఈస్ట్ –     3.06 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.13 కోట్లు

ఏపీ, తెలంగాణ 2 రోజుల షేర్ – 26.71 కోట్లు