శైలజా రెడ్డి అల్లుడి లైన్ క్లియర్

Monday,September 10,2018 - 03:48 by Z_CLU

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకుంది. ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో క్యూరియాసిటీ రేజ్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతుంది ఈ సినిమా.

అవుత అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్యని కంప్లీట్ గా డిఫెరెంట్ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు మారుతి. దానికి తోడు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య, చిలిపి పనులు చేస్తాడు అని చెప్పడంతో, ఈ సినిమాలో చైతు రోల్ చుట్టూ, మరింత బజ్ క్రియేట్ అవుతుంది.

గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించాడు.