ఏమున్నాడండీ మా అన్నయ్య – అక్కినేని అఖిల్

Monday,September 10,2018 - 01:19 by Z_CLU

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, నాగార్జున తో పాటు అక్కినేని అఖిల్ కూడా అటెండ్ అయ్యాడు. సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న వైబ్స్ చూస్తుంటే, ఈ సారి పెద్ద హిట్ కొడుతున్నట్టే అనిపిస్తుంది అని చెప్పుకున్న అఖిల్, నాగచైతన్య గురించి మరో మాట చెప్పాడు.

“ పెళ్ళి తరవాత మా అన్నయ్య ఇంకా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో… ‘ఏమున్నాడండీ మా అన్నయ్య’…” అని మురిసిపోతూ నాగచైతన్యని పొగిడాడు అక్కినేని అఖిల్.

అఖిల్ చెప్పినట్టు బిగినింగ్ నుండే నాగచైతన్య లుక్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంది సినిమా యూనిట్. దాని ఇంపాక్ట్ నాగచైతన్య ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడే తెలిసిపోయింది. దానికి తోడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో రిలీజైన సాంగ్ ప్రోమోస్ ఫ్యాన్స్ ని మరింత మెస్మరైజ్ చేస్తున్నాయి.

ఈ నెల 13 న రిలీజవుతుంది ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా. గోపీ సుందర్ మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్టయింది. కంప్లీట్ టాలీవుడ్ లో కాన్సంట్రేషన్ ఈ సినిమాపై నిలిచే రేంజ్ లో రీచ్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 13 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది.