శ్రియ ఇంటర్వ్యూ

Thursday,August 31,2017 - 04:32 by Z_CLU

బాలయ్య పైసా వసూల్ రేపు గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది శ్రియ.. ఆ విషయాలు మీ కోసం…

పూరి సినిమాలో నటించాలనే కల తీరింది…

పూరి డైరెక్షన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. పూరి చాలా డిఫెరెంట్ డైరెక్టర్. తన స్టోరీస్, క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది.

పైసా వసూల్ లో కొత్తగా ఏముంటుంది..?

కొత్తదనం మీరు సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఇమోషన్స్, ఫన్ కలిసి తెరకెక్కిన సినిమా పైసా వసూల్. సినిమా బిగినింగ్ అయినప్పటి నుండి, ఎండ్ వరకు ప్రతీది ఎంటర్ టైన్ చేస్తుంది.

 

సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది…?

చెప్పడం చాలా కష్టం…. పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. చాలా ధైర్యంగా ఉంటుంది. దేనికీ భయపడదు. పూరి జగన్నాథ్ గారు ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడితే సస్పెన్స్ రివీల్ అయిపోతుంది.

ట్రేలర్స్ చూస్తుంటే బాలయ్య సెంట్రిక్ సినిమా అనిపిస్తుంది

పైసా వసూల్ డెఫ్ఫినేట్ గా బాలయ్య సెంట్రిక్ సినిమానే. బాలయ్య ఎనర్జీకి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ చేశారు ఆయన ఈ సినిమాలో. పైసా వసూల్ సినిమాలో మోస్ట్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ స్టోరీ అయితే ఇమ్మీడియట్ గా హైలెట్ అయ్యేది బాలయ్య పర్ఫామెన్స్…

 

సెట్స్ లో బాలయ్య ఎలా ఉంటారు…

చాలా ఎంకరేజ్ చేస్తారు…. ఆయన్ని చూస్తుంటే ఇన్స్ పిరేషన్ లా ఉంటుంది. అంతెందుకు గౌతమీపుత్ర శాతకర్ణీ లో బాలయ్యకి, ఈ సినిమాలో బాలయ్యకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. అంత వేరియేషన్ అసలెలా పాసిబుల్ అనిపిస్తుంటుంది ఒక్కోసారి… GPS లాంటి హిస్టారికల్ సినిమా తరవాత నెక్స్ట్ సినిమా ఎలాంటిదైతే బావుంటుంది అని కన్ఫ్యూజన్ లో ఉన్న టైమ్ లో మళ్ళీ బాలయ్యతో ఈ సినిమా చేయడం చాలా హ్యాప్పీగా ఉంది.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి…

ప్రస్తుతం ఒక సైకో థ్రిల్లర్ లో నటిస్తున్నా.. డిఫెరెంట్ సినిమాల్లో నటించాలనుంది. క్యారెక్టర్ ఎలాంటిదైనా స్టోరీ స్ట్రాంగ్ గా ఉండే సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నా….

నెగెటివ్ రోల్స్ చేస్తారా…?

నాకు నిజంగా ఈ క్వశ్చన్ మీనింగ్ అర్థం కాదు. పాజిటివ్ క్యారెక్టర్, నెగెటివ్ క్యారెక్టర్… ఏ యాక్టర్ అయినా సినిమా సినిమాకి ఎదగాలి అనుకుంటారు… డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు.. నేను కూడా అంతే.. స్టోరీ చూస్తాను అది బావుంటే.. నెగెటివ్ రోల్. పాజిటివ్ రోల్, సినిమాలో ఎంత సేపు క్యారెక్టర్ ఉంటుంది…? అలాంటివేవీ పట్టించుకోను.. స్టోరీ లో సోల్ ఉంటే సంతకం చేసేస్తాను…

కొత్తగా వస్తున్న హీరోయిన్స్ గురించి…

చెప్పడానికేం లేదు.. అందరూ బాగా చేస్తున్నారు… పైసా వసూల్ లో ఇద్దరు అమ్మాయిలూ కైరా దత్, ముస్కాన్ కూడా ఏ మాత్రం కొత్తవాళ్ళు అనే ఫీలింగ్ లేకుండా కష్టపడ్డారు…