ప్యాకప్ చెప్పనున్న బాలయ్య ‘పైసా వసూల్’

Monday,July 17,2017 - 11:16 by Z_CLU

బాలయ్య ‘పైసా వసూల్’ పోస్ట్ ప్రొడక్షన్ బిగిన్ అయింది. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను బిగిన్ చేసేసింది సినిమా యూనిట్. పూరి స్టైల్ లో ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ పనులను జరుపుకుంటున్న సినిమా యూనిట్, నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను బిగిన్ చేసేసింది. ఈ నెల 28 న షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్న సినిమా యూనిట్ సినిమాని సెప్టెంబర్ 29 న రిలీజ్ చేయనుంది.

బాలయ్య గ్యాంగ్ స్టర్ లా కనిపించనున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రియ శరణ్, ముస్కాన్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య మాస్ సాంగ్ పాడటం సినిమాకి హైలెట్ కానుంది.