టైటిల్ మాత్రమే సీక్వెల్...

Monday,August 28,2017 - 12:59 by Z_CLU

కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజు గారి గది -2’ రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఓ వైపు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 13 న థియేటర్స్ లో రానుంది.. లేటెస్ట్ గా తన పుట్టినరోజు సందర్భంగా నాగ్ ఈ సినిమా విశేషాలను తెలియజేశాడు..

నాగార్జున మాట్లాడుతూ “నిజానికి ఈ సినిమా రాజు గారి గది సినిమాకు సీక్వెల్ అనుకుంటున్నారు. కానీ టైటిల్ మాత్రమే సీక్వెల్.. ఆ సినిమాకు ఈ సినిమాకు అస్సలు సంబంధం ఉండదు.. ప్రస్తుతం షూటింగ్ పూర్తయ్యింది. ఒక రోజు ప్యాచ్ వర్క్ షూట్ బ్యాలెన్స్ ఉంది. నాకు వెన్నెల కిషోర్ కి మధ్య వచ్చే కొన్ని సీన్స్ తీయాలి. ప్రెజెంట్ తను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆ షూట్ పూర్తి చేసి 10th వరకూ ఫస్ట్ కాఫీ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో ఓ మెంటలిస్ట్ గా నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్ చేసే ముందు కొంత మంది మెంటలిస్ట్ లను కలిశాను. వాళ్ళు చాలా రిజర్వ్ గా ఉంటూ అన్నీ కనిపెట్టేస్తుంటారు. అది మాయ అనలేం కానీ వాళ్లకి ఓ అబ్సర్వేషన్ పవర్ ఉంటుంది. అన్నీ తెలుసుకొని ఎప్పుడు అవసరమో అప్పుడే చెప్తారు. సమంత ఓ సోల్ గా కనిపించనుంది. తన క్యారెక్టర్- నా క్యారెక్టర్ మధ్యే కథ నడుస్తుంటుంది. ‘ప్రేతమ్’ అనే సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తున్న సినిమా ఇది. అక్టోబర్ లో సినిమా రిలీజ్ అవుతుంది.” అన్నారు.