సెప్టెంబర్ 1న "పైసా వసూల్" రిలీజ్

Sunday,July 30,2017 - 06:28 by Z_CLU

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా రిలీజ్ డేట్ పక్కా అయింది. ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు భవ్య క్రియేషన్స్ సంస్థ ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది.

నిజానికి పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ గతంలో పలుమార్లు చెప్పుకొచ్చాడు. కానీ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న టైం కంటే ముందే పూర్తవ్వడంతో మూవీని కూడా ముందే విడుదల చేస్తున్నారు.

మాఫియా డాన్ క్యారెక్టర్ లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాలో నటసింహం సరసన మరోసారి శ్రియ హీరోయిన్ గా మెరవనుంది. మరో రెండు కీలకమైన పాత్రల కోసం కైరా దత్, ముస్కాన్ లను ఎంపిక చేశారు. ఇప్పటికే విడుదలైన పైసా వసూల్ స్టంపర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.