బాలయ్య చేతిలో ఏకే-47

Thursday,June 14,2018 - 05:03 by Z_CLU

ప్రస్తుతం బాలయ్య చేతిలో 2 సినిమాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్న నటసింహం… సేమ్ టైం వీవీ వినాయక్ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సి.కల్యాణ్ బ్యానర్ పై వినాయక్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ మూవీకి ఏకే-47 అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారు. క్యారెక్టర్స్, టైటిల్స్ విషయంలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు బాలకృష్ణ. పైసావసూల్ సినిమాలో తేడా సింగ్ అనే క్యారెక్టర్ చేసి అందర్నీ షాక్ కు గురిచేశాడు. ఇప్పుడు ఏకే-47 అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నాడు.

ఈ టైటిల్ ను ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందా లేక  ఎన్టీఆర్ బయోపిక్ ముందుగా సెట్స్ పైకి వస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఏది ముందు స్టార్ట్ అయితే, అదే సంక్రాంతికి  విడుదలవుతుంది.