ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ ఎనౌన్స్ మెంట్

Thursday,January 18,2018 - 12:34 by Z_CLU

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఈరోజు “ఎన్టీఆర్ బయోపిక్” టైటిల్ ను విడుదల చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమాకు NTR అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్న స్టిల్ ను టైటిల్ తో పాటు విడుదల చేశారు.

“ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి.” అనే క్యాప్షన్ ను యాడ్ చేశారు. సాయికొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. 62 గెటప్పులతో మెస్మరైజ్ చేయబోతున్నారు. కల్యాణ్ రామ్ కొడుకు కూడా ఈ బయోపిక్ లో నటిస్తున్నాడు.

నిజానికి ఈరోజు టీజర్ విడుదల చేస్తారని అంతా భావించారు. టీజర్ కోసం బాలకృష్ణపై ప్రత్యేకంగా షూట్ కూడా చేశారు.
కానీ కొన్ని కారణాల వల్ల టీజర్ ను ఈరోజు విడుదల చేయలేదు. ఓ మంచి రోజు చూసి టీజర్ విడుదల చేస్తారు.