ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన షారుక్ ఖాన్

Thursday,June 14,2018 - 04:08 by Z_CLU

ఈద్ సందర్భంగా షారుక్ ఖాన్ ‘జీరో’ సెకండ్ టీజర్ రిలీజయింది. అయితే ఈ టీజర్ లో షారుక్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరాలు డబుల్ అయిపోయాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కామియో రోల్ లో ఎట్రాక్ట్ చేయనున్నాడు. అయితే ఈ టీజర్ లో చాలా రోజుల తర్వాత ఈ స్టార్స్ ని ఒకే ఫ్రేమ్  లో చూసిన ఫ్యాన్స్, సోషల్ మీడియాలో కరణ్ అర్జున్ సినిమాని తలుచుకుంటున్నారు.

ఇక ఈ టీజర్ విషయానికొస్తే 1:21 సెకన్ల పాటు ఉన్న టీజర్ లో మరుగుజ్జు లా నటిస్తున్న షారుక్ ఖాన్ కాస్త భయపడుతూ ఒక డ్యాన్స్ ఈవంట్ కి అటెండ్ అవ్వడం, అప్పుడే అక్కడకి వచ్చిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కి ధైర్యం చెప్పి, ఇద్దరు డ్యాన్స్ ఫ్లోర్ పై డాన్స్ చేయడం లాంటి ఎలిమెంట్స్, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.

ఆనంద్ L. రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ సరసన కత్రినా కైఫ్ తో పాటు అనుష్క శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాధవన్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. డిసెంబర్ 21 న రిలీజవుతుంది ఈ సినిమా.