Balakrishna Boyapati - టైటిల్ ఏంటి?

Sunday,April 11,2021 - 02:29 by Z_CLU

బాలకృష్ణ-బోయపాటి సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పెట్టారంట. ఈ సినిమాకు రక్షకుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ రెండు కాదు, సినిమాకు పెద్దాయన అనే టైటిల్ పెట్టారు. ఇలా Balakrishna Boyapati కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ పై ఎన్నో రూమర్స్, మరెన్నో అంచనాలు. ఇన్నాళ్లకు ఈ పుకార్లకు చెక్ పడబోతోంది. ఉగాది నాడు ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయబోతున్నారు.

బాలయ్యకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఏ పని చేసినా ముహూర్తం చూసి చేయడం ఆయనకు అలవాటు. తన కొత్త సినిమా టైటిల్ కోసం కూడా ఆయన ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 13 ఉగాది రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నారు.

balakrishna boyapati movie may 28 release zeecinemalu

బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. బాలయ్య లుక్ ఎలా ఉండబోతోందనే విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఈసారి టైటిల్ తో పాటు ఓ కొత్త స్టిల్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Balakrishna Boyapati కాంబినేషన్ లో ఇంతకుముందు సింహా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టొచ్చింది. ఆ తర్వాత సింహాను మించిన రేంజ్ లో లెజెండ్ అనే మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడీ రెండు సినిమాల్ని క్రాస్ చేసేలా హ్యాట్రిక్ మూవీ వస్తుందని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్ల అంచనాల్ని అందుకునేలా టైటిల్ పెట్టడంతో పాటు, సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేశాడు దర్శకుడు బోయపాటి.

సినిమాలో బాలయ్య మొత్తం 3 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతానికి ఓ గెటప్ రివీల్ చేశారు. మూవీలో బాలయ్య సరసన పూర్ణ, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్, సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారా చేయరా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics