మరో స్టార్ ని ఇంట్రడ్యూస్ చేయనున్న తేజ

Thursday,June 14,2018 - 05:36 by Z_CLU

తేజ మరో స్టార్ ని లాంచ్ చేయనున్నాడు. రీసెంట్ గా రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ప్రముఖ నిర్మాత D.V.V. దానయ్య కొడుకును హీరోగా లాంచ్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

స్టార్ డమ్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడం తేజ కి పెద్ద విషయమేం కాదు. తన ఫస్ట్ మూవీ ‘చిత్రం’ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న తేజ ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ ని హీరోగా లాంచ్ చేశాడు. ఆ తరవాత సొంత నిర్మాణంలో అందరూ కొత్తవాళ్ళతో ‘జయం’ సినిమాను తెరకెక్కించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా రికార్డ్స్  బ్రేక్ చేశాడు.  ఈ సినిమాతో నితిన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

‘ఒక విచిత్రం’ సినిమాతో ఆది పినిశెట్టిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజనే. ‘జై’ సినిమాతో నవదీప్ ని ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ తో ప్రిన్స్ ని పరిచయం చేశాడు. ఇదే వరసలో గతంలో ‘కేక’ సినిమాతో సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు రాజాని ఇంట్రడ్యూస్ చేసిన తేజ, ఇప్పుడు D.V.V. దానయ్య కొడుకుతో సినిమా చేయబోతున్నాడు.