సెట్స్ పైకి రానున్న బాలయ్య సినిమా

Tuesday,May 15,2018 - 04:44 by Z_CLU

ఈ నెలలో కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడు బాలయ్య. మాసివ్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 27 నుండి సెట్స్ పైకి రానుంది. వినాయక్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో బాలయ్యను డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్న వినాయక్, ఆల్మోస్ట్  ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన కీ టెక్నీషియన్స్ దగ్గరి నుండి, తక్కిన కాస్టింగ్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

 

గతంలో ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘చెన్నకేశవ రెడ్డి’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్ళీ అదే కాంబో సెట్స్ పైకి వస్తుండేసరికి ఫ్యాన్స్ లో అప్పుడే పాజిటివ్ వైబ్స్ బిగిన్ అయిపోయాయి. ఈ సినిమాని C. కళ్యాణ్, CK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.