GPS కి సమయమే కాదు ట్యాక్స్ కూడా లేదు

Tuesday,January 10,2017 - 12:47 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజవుతున్న గౌతమీపుత్ర శాతకర్ణీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హై ఎండ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసుకుంది. అత్యంత  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఫ్యాన్సే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల  ప్రభుత్వాలు గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి.

తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గౌతమీ పుత్ర శాతకర్ణీ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ ని రద్దు చేశాయి తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలు. జనవరి 12 న గ్రాండ్ స్పీడ్ తో సిల్వర్ స్క్రీన్ పై మీసం తిప్పనున్న గౌతమీపుత్ర శాతకర్ణీ… సంక్రాంతి పండగను రెండు రోజులు ముందుగానే తీసుకొస్తుంది.