బాలయ్యను ఘనంగా సత్కరించిన TSR

Tuesday,January 31,2017 - 05:18 by Z_CLU

బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణీ ఎక్స్ పెక్టేషన్స్ ని మించి రీచ్ అయి అయింది. జస్ట్ నందమూరి ఫ్యాన్స్ చేతే కాకుండా, తెలుగు వారందరి చేత సాహో తారకరామ పుత్ర బాలకృష్ణ అనిపించుకున్న బాలకృష్ణని, డైరెక్టర్ అంజనాపుత్ర క్రిష్ ని సగౌరవంగా సత్కరించారు కళాబంధు T. సుబ్బిరామిరెడ్డి.

ల్యాండ్ మార్క్ సినిమా కావడం… అందునా ఫ్యాన్స్ హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణీ రిలీజైన ఫస్ట్ రోజే, రైట్ కాన్సెప్ట్ ఆన్ రైట్ టైం అనే టాక్ తో, రిలీజైన ప్రతి సెంటర్ లోను పాజిటివ్ టాక్ తో ఎట్రాక్ట్ చేసింది.

tsr-felicitates-gpsteam

బాలయ్యను, క్రిష్ ను ఘనంగా సత్కరించిన ఈ వేడుకలో దర్శక బాహుబలి రాజమౌళి, వెంకటేష్, తమన్నా, జయసుధ, తనికెళ్ళ భరణి, రాఘవేంద్ర రావు లాంటి ప్రముఖులతో పాటు బాలయ్య కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.