ఖైదీ సినిమా చూడ్డానికి 10 రీజన్లు

Tuesday,January 10,2017 - 02:41 by Z_CLU

ఖైదీ మానియా బిగిన్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా వెంచర్ రెడీ. సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే ఎండ్ లెస్ ఎగ్జైట్ మెంట్ ని క్రియేట్ చేసిన ఖైదీ నం 150, లెక్కలేనన్ని సర్ ప్రైజెస్ తో ఫుల్ మీల్స్ లా రెడీ అయింది. అయితే ఈ సినిమాను ఎందుకు చూడాలి. కచ్చితంగా చూడాల్సిన 10 రీజన్స్ ఉన్నాయి. హేవే లుక్…

khaidi-reason-1

ఖైదీ నం 150 సినిమా అనౌన్స్ చేసినప్పుడే సూపర్ హిట్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది. అసలీ సినిమా ఎందుకు చూడాలి..? అన్న క్వశ్చన్ రేజ్ అయితే ఒకే ఒక్క మిలియన్ డాలర్ ఆన్సర్ మెగాస్టార్ కం బ్యాక్ మూవీ… దటీజ్ మెగా స్టామినా.. అన్ని అంశాలున్న కథ తో రి ఎంట్రీ ఇస్తూ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకోబుతున్నాడు మెగా స్టార్

khaidi-no-150-2

అప్పట్లో వచ్చిన ఠాగూర్ సినిమాను ఎవరూ మరిచిపోలేరు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు-వినాయక్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే, ఎమోషనల్ గా అది ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా వినాయక్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ ఎక్స్ టార్డనరీ గా ఉంటుంది. అందుకే ఈసారి ఠాగూర్ ను మించిన సక్సెస్ గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. ఠాగూర్ లో హీరోయిన్ గా నటించిన శ్రియ, ఖైదీలో కూడా ఉందనే టాక్ నడుస్తోంది.

khaidi-no-150-3

అమ్మడు..లెట్స్ డు కుమ్ముడు… సోషల్ మీడియాను కుమ్మేసిన ఈ సాంగ్ ఖైదీ నంబర్ 150కి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. దీంతో పాటు రత్తాలు అనే ఐటెంసాంగ్, సుందరి అనే సాంగ్, యు అండ్ మీ  అనే సాంగ్.. ఇలా చాలా పాటలు ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించడం ఖాయం.

khaidi-no-150-5

కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు… తెలుగు ప్రేక్షకులంతా చిరంజీవి డాన్స్ ను మిస్ అయ్యారు. అసలు చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నాడంటేనే అందులో మెగాస్టార్ స్టెప్పులు ఎలా ఉంటాయా అనే ఆరాలు ఎక్కువైపోయాయి. అందరి అంచనాలకు తగ్గట్టు 2-3 స్టెప్పుల్ని ట్రయిలర్ లో చూపించిన చిరంజీవి… ఖైదీ నంబర్ 150తో తనలో డాన్స్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోబోతున్నాడు. మరీ ముఖ్యంగా తన ఐకానిక్ సిగ్నేచర్ మూమెంట్ వీణ స్టెప్ ను ఖైదీ నంబర్ 150లో రీమిక్స్ చేశారు చిరంజీవి.

khaidi-no-150-8

గతంలో రామ్ చరణ్ తో కలిసి కాజల్ ఎన్నో సూపర్ హిట్స్ లో నటించింది. మరి అలాంటి హీరోయిన్ ను తెచ్చి చిరంజీవి సరసన నిలబెట్టారు. ఖైదీ మూవీ సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి అందరికీ ఇవే డౌట్స్. చెర్రీతో మెరిసిన కాజల్ చిరు సరసన ఎలా ఉండబోతోందంటూ చర్చలు. అయితే విడుదలైన 2-3 స్టిల్స్ తోనే తమ కెమిస్ట్రీ అదుర్స్ అనిపించారు చిరు. ఇక వెండితెరపై చిరు-కాజల్ కాంబోలో వచ్చే సన్నివేశాలు చూసి తరించాల్సిందే.

khaidi-no-150-6

యాక్షన్, ఫైట్స్ లేని చిరంజీవి సినిమాలుంటాయా.. ఖైదీ నంబర్ 150 కూడా దీనికి మినహాయింపపు కాదు. ట్రయిలర్ తో ఇప్పటికే యాక్షన్ ఎలిమెంట్స్ ను రుచిచూపించిన మెగాస్టార్… తన రీఎంట్రీ వెంచర్ ను కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తయారుచేశారు. చిరంజీవి చెప్పే డైలాగులు, చేసే ఫైట్స్ సినిమాకు పెద్ద ఎట్రాక్షన్.

khaidi-no-150-4

చిరంజీవి రీఎంట్రీ మూవీ అనేదే అతిపెద్ద రీజన్ అనుకుంటే… ఖైదీ నంబర్ 150లో చిరంజీవి డ్యూయల్ రోల్ అనేది మరో అతిపెద్ద రీజన్. తెరపై ఒక చిరంజీవిని చూసేందుకే ఫ్యాన్స్ ఇన్నాళ్లూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారు. అలాంటిది సింగిల్ స్క్రీన్ పై డబుల్ బొనాంజా చూపించబోతున్నాడు మెగాస్టార్.

khaidi-no-150-7

ఖైదీ నంబర్ 150లో చిరంజీవిని చూడ్డానికే రెండు కళ్లు చాలవు. అలాంటిదే ఓ సందర్భంలో మెగాస్టార్ తో కలిసి మెగా పవర్ స్టార్ కూడా కనిపించబోతున్నాడు. వెండితెర జిగేల్ మంటూ మెరవడానికి ఇంతకంటే అతిపెద్ద రీజన్ ఇంకేం కావాలి.

khaidi-no-150-10

ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్, ఖైదీ నంబర్ 150 సినిమాలో లొకేషన్స్ ని కూడా సరికొత్తగా సెలెక్ట్ చేసుకుంది. ఉక్రెయిన్, క్రొయేషియా, స్లొవేనియా లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిరు సినిమా… వెండితెరపై సరికొత్త అందాల్ని ప్రజెంట్ చేయబోతోంది.

khaidi-no-150-22

ఖైదీ నంబర్ 150 సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ నిర్మాత రామ్ చరణ్. మొన్నటివరకు ఇతడు మెగా పవర్ స్టార్ మాత్రమే. కానీ తండ్రి రీఎంట్రీ మూవీతో మెగా ప్రొడ్యూసర్ కూడా అనిపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. నిర్మాతగా చరణ్ ఫస్ట్ మూవీ ఇది.