బాలకృష్ణ కొత్త సినిమా పేరు ఉస్తాద్..?

Wednesday,March 29,2017 - 02:20 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. నందమూరి నటసింహం 101వ సినిమాగా తెరకెక్కుతున్నఈ మూవీకి ఉస్తాద్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ పేరును అధికారికంగా ప్రకటించలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య-పూరి కాంబోలో వస్తున్న సినిమా పేరు ఇదే అంటూ తెగ ప్రచారం సాగుతోంది.

బాలయ్య-పూరి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించి భారీ ఫైట్ పిక్చరైజ్ చేశారు. నెక్ట్స్ వీక్ నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ముస్కాన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సెకెండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలేపు టైటిల్ ను ఫైనలైజ్ చేసే ఛాన్స్ ఉంది.